హామీల అమలుకై ఈనెల 20 న చలో హైదరాబాద్
న్యూస్‌తెలుగు/వనపర్తి : హామీల అమలుకై ఈనెల 20 న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామంలో సిపిఐ ( ఎం.ఎల్ )న్యూ డెమోక్రసీ నాయకులు వాల్ పోస్టర్ల ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే వందరోజులలోఅమలు చేస్తామని ప్రకటించింది సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ తక్షణమే హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి14 నెలలైనా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. రైతు భరోసా 15000 ఎకరాకు, మహిళలకు మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి మహిళకు నెలకు2500, వృద్ధాప్య పింఛన్ 4000, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, కొత్తగా పెళ్లి అయిన వధూ,వరులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు తో పాటు తులం బంగారం లాంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఈ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ హామీల అమలు కొరకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై నిరసన తెలిపి అధికార కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ముని, లక్ష్మణ్, తిరుమలేష్, వెంకటన్న, రమేష్, మునెప్ప,శ్రీనుతదితరులు పాల్గొన్నారు. (Story : హామీల అమలుకై ఈనెల 20 న చలో హైదరాబాద్)