ఆంధ్ర పోలీసుల హై అలర్ట్
న్యూస్‌తెలుగు/చింతూరు : ఈనెల 9వ తేదీన బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా చత్తీస్గడ్ లో మావోయిస్టులు మంగళవారం సంపూర్ణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చింతూరు, ఎటపాక, కూనవరం, వి ఆర్ పురం మండలాల్లో పోలీసులు పోలీస్ స్టేషన్ పరిధిలో అలెర్ట్ అయ్యారు. చింతూరు మండలంలో సీఐ తెల్లం దుర్గాప్రసాద్ సూచనల మేరకు ఎస్ఐ రమేష్ మావోయిస్టుల బంద్ సందర్భంగా ఒరిస్సా నుండి, చతిస్గడ్ నుండి వచ్చి వెళ్లే వాహనాలను విస్తృతంగా తనఖిలు చేపట్టారు. అనుమానీతుల వేలి ముద్రల ద్వారా చెక్ చేసుకున్నారు. బాంబింగ్ స్క్వాడ్ సిబ్బందితో ప్రత్యేక జాగిలాలతో ప్రతి వంతెన వద్ద, ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహించారు. బందు దృష్ట్యా భద్రాచలంవైపు వెళ్లాల్సిన వాహనాలను మంగళ, బుధవారాల్లో రాత్రిళ్ళు కూనవరం మీదుగా వాహనాలను మళ్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే చింతూరు నుండి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నడుస్తున్న అల్లిగూడెం ఆర్టీసీ బస్సును రద్దు చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది , సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నారు. (Story : ఆంధ్ర పోలీసుల హై అలర్ట్)