20న జాబ్ మేళా
న్యూస్‌తెలుగు/విజయవాడ: ఈనెల 20వ తేదీన ఆలూరు నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బహుజన టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ బిహెచ్ అనిల్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. (Story: 20న జాబ్ మేళా)