క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, యువత ఉన్నత చదువులతోపాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పట్టణం 22వ వార్డు బాలాజీ నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన బాక్స్ క్రికెట్ క్రీడా ప్రాంగణాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద బాక్స్ క్రికెట్ ప్రాంగణాన్ని ఏర్పాటుచేసి క్రీడా శిక్షణను ఇస్తున్న యువకులు చంద్రకాంత్, సాయికాంత్ భాను ప్రకాష్, గిరీష్ లను ఎమ్మెల్యే అభినందించారు. ఆసక్తిగల క్రికెట్ క్రీడాకారులు ఈ క్రీడా ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. క్రీడల వలన జాతీయ అంతర్జాతీయ స్థాయిలోను గుర్తింపు పొందవచ్చునని దాంతో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొంత గ్రామానికి పేరు ప్రఖ్యాతలు చేకూరుతాయని ఎమ్మెల్యే అన్నారు. యువకులుఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఇలాంటి స్వయం ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తు బాగుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ గోవర్ధన్ సాగర్ జిల్లాయూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, వనపర్తి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, వనపర్తి మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య, మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట)