బొల్లా అవినీతి అసమర్ధత కారణంగానే ఘాట్ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా మారాయి
ప్రభుత్వ చీఫ్ విప్ జివి
న్యూస్ తెలుగు/ వినుకొండ : బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో ఆయన అవినీతి అసమర్థత కారణంగా విను, కొండ ఘాట్ రోడ్డు పనులు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయని. ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ధ్వజమెత్తారు. గత కొన్ని మాసాలుగా నిలిచిపోయిన ఘాట్ రోడ్, ఆలయ నిర్మాణం పనులను గురువారం జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున్ రావు, కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. అస్తవ్యస్తంగా ఉన్న ఘాట్ రోడ్డు నుండి వాహనాల ద్వారా కొండపైకి చేరుకున్న జివి, నిలిచిపోయిన ఆలయ పనులు పరిశీలించారు. బొల్లా హయాంలో అవినీతి అసమర్థత కారణం గా పనులు నిలిచి పోయాయని, అప్పుడు ఘాట్ రోడ్డు కోసం తవ్విన పెద్ద పెద్ద రాతిబండలను కిందకు తరలించకుండా ఉన్న కారణంగా ఇప్పుడు ఆ బండలన్నీ ఘాట్ రోడ్డు మీద పడి రోడ్డు మూసుకుపోవడంతో పాటు పెద్ద బండలు, కొండ దిగు భాగాన ఉన్న గృహాలపై, ఆలయాలపై పడి అవి ధ్వంసం కావడం జరిగిందని, దీని కారణం బొల్లా బ్రహ్మనాయుడు అని జీవి ఆగ్రహించారు. ఆనాడు తొలగించిన బండ రాళ్లు కిందకు తరలించాలని ఇంజనీర్లు చెప్పినప్పటికీ బ్రహ్మనాయుడు అడ్డు తగిలి అక్కడకక్కడే పక్కకు నెట్టివేయమన్నారని, దాని కారణంగానే వర్షం కురిసినప్పుడు ఆ బండలన్నీ ఘాట్ రోడ్డు పై పడి రోడ్డు అసలు మారి దిగు భాగాన గృహాలకు, ఆలయాలకు ప్రమాదం వాటిలిందని జివి అన్నారు. తాము త్వరితగతిన సంబంధిత ఇంజనీర్లను పిలిపించి ఆలయ కమిటీ వేసి, త్వరితగతిన ఘాట్ రోడ్డు పనులు, కొండపై ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఘాట్ రోడ్ ఇరువైపులా డ్రైనేజీలు అక్కడపటిష్టంగా సైడ్ వాల్సు నిర్మించి ఘాట్ రోడ్ కిరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. అలాగే కొండపైన భక్తుల సౌకర్యార్థం అన్ని నిర్మాణ పనులు పార్కింగ్ వసతి, ఆహ్లాదకరమైన పార్కు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు కొండపై శ్రీ రామలింగేశ్వర ఆలయ పునర్ నిర్మాణ పనులకు నిధులు ఎంతైనా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు హామీ ఇచ్చారని జివి ఈ సందర్భంగా అన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ. గతంలోనే జివి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు అప్పుడు ప్రభుత్వం ఏడున్నర కోట్లు నిధులు మంజూరు చేయగా, శంకుస్థాపన చేయడం జరిగిందని. ప్రభుత్వం మారడంతో ఆ పనులు నిలిచిపోయాయని, అలాగే వైసిపి హయాంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పనులు ప్రారంభించినప్పటికీ అవగాహన లోపం కారణంగా పనులు వేగవంతం చేయలేక నిలిపివేశారని మక్కెన ఈ సందర్భంగా అన్నారు. ఏదైనా, కూటమి ప్రభుత్వ హయాంలో ఘాట్ రోడ్ పనులు, ఆలయ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో పూర్తిచేసి భక్తుల సౌకర్యార్థం అన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు. జివి తో పాటు, మాజీ ఎమ్మెల్యే మక్కెన, మేడం రమేష్, కే.నాగ శ్రీను, పి. అయూబ్ ఖాన్, షమీమ్, పి.వి. సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.(Story : బొల్లా అవినీతి అసమర్ధత కారణంగానే ఘాట్ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా మారాయి)