రైతులలో ఆత్మస్థైర్యం నింపేందుకే
అధ్యయన కమిటీ పర్యటన
న్యూస్తెలుగు/వనపర్తి ; మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి ఇబ్రహీం పట్నం, తదితర ప్రాంతాలలో కమిటీ సభ్యులతో కలసి విస్తృతంగా పర్యటించారు. కోరుట్ల నియోజక వర్గం ఇబ్రహీం పట్నంలో రుణ మాఫీ కాక రైతు భరోసా లేక దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటాం అని మనోధైర్యం నింపారు. అనంతరం జరిగిన సమావేశములో మాట్లాడుతూ దగాపడ్డ రైతుల సమస్యల చూసి చలించిన కె.సి.ఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమం చేపట్టి రాష్ట్రాన్ని సాదించినారని అన్నారు.9సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణ మాఫీ రైతు భరోసా రైతు భీమా వంటి వినూత్న పథకాలు సృష్టించి నిముషం పాటు కూడా కరెంట్ కోత లేకుండా చేసి వ్యవసాయాన్ని పండుగ చేశారని కొనియాడారు.
వలసలు వెళ్లిన రైతులు తిరిగివచ్చి పాడిపంటలతో కుటుంబాలు విలసిల్లెల కె.సి.ఆర్ చేశారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరిట 2లక్షల రుణ మాఫీ,రైతు భరోసా 15000,ధాన్యం పై 500బోనస్,కౌలు, రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు. రైతు సంక్షేమ పథకాలు యెగ్గొట్టడంతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలములో 418మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని అన్నారు. తమ పర్యటనలో రైతు కుటుంబాల బాధలు చూసి చలించిపోయినామని అన్నారు .చిన్నారులు కన్న తల్లి కన్నీటి చుక్కలు తుడువడం చూస్తుంటే కడుపు తరుకు పోతుందని విచారం వ్యక్తం చేశారు.
రైతులలో ఆత్మస్థైర్యం నింపి మీ తరుపున బి.ఆర్.ఎస్ పార్టీ పోరాడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన రైతు హామీలు అమలు చేసేవరకు పోరాడతామని కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వందరోజులో రైతు బంధు,రైతు రుణ మాఫీ,రైతు భీమా,ఉపాధి,రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని 14నెలలు గడిచినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాడని ఖండించారు. (Story : రైతులలో ఆత్మస్థైర్యం నింపేందుకే అధ్యయన కమిటీ పర్యటన)