చత్తీస్గడ్ లో ఎదురుకార్పులు
ఒక మావోయిస్టు మృతి
న్యూస్‌తెలుగు/చింతూరు : చతిస్గడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా నారాయణపూర్ సరిహద్దు ప్రాంతం మావోయిస్టు నార్త్ బస్తర్ మాద్ డివిజన్ కమిటీ ఉన్నారనే పక్కా సమాచారం మేరకు అబూజ్మా డ్ దట్టమైన అటవీప్రాంతం లో డి ఆర్ జి , బిఎస్ఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా కుబీంగ్ చేపట్టాగా ఎదురుపడ్డ మావోయిస్టు లకు బాలగాలకు బీకరమైన కాల్పులు జరిగాయి. దీంతో దట్టమైన అటవీప్రాంతం దద్దరిలింది.నిన్నటి నుండి జరుగుతున్న ఈ ఆపరేషన్ లో నిన్న కొంత సమయానికి కాల్పులు ఆగిపోయాయి. ఇప్పటివరకు ఘటన స్థలం లో ఇప్పటివరకు యూనిఫారం తో ఉన్న ఒక మావోయిస్టుల మృతదేహం,ఒక ఎస్ ఎల్ ఆర్ రైఫిల్, రోజువారి వంటసామాగ్రి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన నక్సలైట్ క్యాడర్, ఎవరనేది ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో ఇంకా చాలా మంది నక్సలైట్లు మరణించడం లేదా గాయపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఆ ప్రాంతం లో చాలకాలం తరువాత జరుగుతున్న ఎంకౌంటర్ అని మాత్రం చెప్పవచ్చు. (Story : చత్తీస్గడ్ లో ఎదురుకార్పులు)