గుడ్ షెఫర్డ్ స్కూల్లో కరాటే బెల్ట్ టెస్ట్..
న్యూస్ తెలుగు/ వినుకొండ : స్థానిక గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో వినుకొండ నియోజకవర్గ స్థాయిలో కరాటే బెల్ట్ టెస్టు జపాన్ షితోరియో కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో సోమవారం కరాటే మాస్టర్ ఖాజా మొహిద్దీన్ నిర్వహించారు. ఈ బెల్ట్ టెస్ట్ కి వివిధ పాఠశాలల నుండి సుమారు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కరాటే బెల్ట్ టెస్ట్ అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు, రాష్ట్ర కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి. ప్రభాకర్ ఎగ్జామినర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ శ్రీమతి లక్ష్మీ సునీత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. కరాటే క్రీడా ప్రాచీనమైనదని, ఖర్చు లేనిదని తెలిపారు. ఇది సాధన చేసినట్లయితే ఆత్మ రక్షణకు ఉపయోగపడుతుందని అన్నారు. అంతేకాకుండా ధైర్యం పెంపొందించుకోవచ్చని అన్నారు. ప్రస్తుత కాలానికి ఆడపిల్లలకు ఈ క్రీడా ఎంతో ఉపయోగపడుతుందని, రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలలో కూడా మూడు శాతం క్రీడా విభాగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. కావున ప్రతి ఒక్కరు ఈ కరాటే క్రీడ సాధన చేయవలసిన అవసరం ఉందని, అంతేకాకుండా తమ పాఠశాలలో కరాటే మాస్టార్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకు కరాటే క్లాసులు నిర్వహిస్తున్నామని, ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. నిర్వాహకులు రాష్ట్ర కరాటే అసోసియేషన్ సెక్రటరీ ప్రభాకర్ మాట్లాడుతూ. కరాటే క్రీడా పట్టణానికే పరిమితమై ఉండేదని, ప్రస్తుత రోజుల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందే లాగా చూస్తున్నామని అన్నారు. స్వీయ రక్షణకు కరాటే ఉపయోగపడుతుందని తెలిపారు. స్థానిక కరాటే మాస్టర్ షేక్ ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ. ఈ బెల్టు టెస్ట్ కు సుమారు 70 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్నారని అన్నారు. వారికి ఎల్లో,గ్రీన్, ఆరెంజ్, బ్రౌన్,బెల్ట్ టెస్టులు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అవకాశం కల్పించినందుకు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.(Story : గుడ్ షెఫర్డ్ స్కూల్లో కరాటే బెల్ట్ టెస్ట్..)