వైసిపి పాలనలో అధ్వానంగా మారిన రోడ్లు.. డ్రైనేజీలు
ప్రభుత్వ చీఫ్ విప్ జీవికి మొరపెట్టుకున్న 23వ వార్డు మహిళలు
న్యూస్ తెలుగు/ వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు మంగళవారం నాడు మున్సిపల్ అధికారులతో కలిసి 23వ వార్డులో పర్యటించారు. అయితే 23 వ వార్డు మహిళలు పలు సమస్యలతో స్వాగతం పలుకుతూ అధ్వానంగా మారిన సిమెంట్ రోడ్లు డ్రైనేజీలను చూపెట్టారు. ప్రధానంగా పఠాన్ కాసింఖాన్ వీధిలో వైసిపి హాయంలో పైపులైన్ అంటూ రోడ్లు డ్రైనేజీ మీద కప్పులు తొలగించి పైపులైన్ వేసిన అనంతరం మరల మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేసారంటూ మహిళలు జీవికి వివరించారు. 23 వ వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని వార్డు ప్రజలు జీవికి ఏ కరువు పెట్టారు. స్పందించిన జీవి . పఠాన్ కాసింఖాన్ వీధిలో తక్షణం రోడ్లు డ్రైనేజీ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కు సూచించారు. ఈ అభివృద్ధి పనులకు 17.50 లక్ష లు మంజూరు చేశారు. అలాగే కొందరు వృద్ధ మహిళలు తమకు పెన్షన్లు మంజూరు కాలేదని పెన్షన్ ఇప్పించాలని కోరగా దరఖాస్తులు చేసుకోవాలని జీవి సూచించారు. అలాగే మరి కొంతమంది మహిళలు రేషన్ సక్రమంగా సరఫరా జరగటం లేదని. రేషన్ దుకాణం ఎప్పుడు తీస్తారో తెలియకుండా ఉందని. ఎమ్మెల్యే జీవికి తెలిపారు. దీంతో రేషన్ సక్రమంగా జరిగేటట్టు చూడాలని ఈసారి తమకు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జీవీ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. ఎమ్మెల్యే తో పాటు టిడిపి పట్టణ అధ్యక్షులు పి.అయూబ్ ఖాన్, షమీం, వార్డ్ కౌన్సిలర్ నన్నేసా, మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, నాయకులు పాల్గొన్నారు.(Story : వైసిపి పాలనలో అధ్వానంగా మారిన రోడ్లు.. డ్రైనేజీలు)