Homeవార్తలుతెలంగాణఅర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వ లక్ష్యాలు అన్యాక్రాంతం కాకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలనే గ్రామ సభలు పెట్టీ ప్రజామోదం పొందటం జరుగుతుందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాల పై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో భాగంగా గురువారం ఉదయం ఘనపూర్ మండలంలోని సల్కలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకే అందాలని, ఇంకా ఎవరైనా మిగిలిపోయిన, పేర్లు జాబితాలో లేకున్నా నమోదు చేసుకొనేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలి, సంక్షేమ పథకాలను అందించాలి అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వద్ద ఉన్న దరఖాస్తులను ప్రజల ముందు చదివి వినిపించడం జరుగుతుందన్నారు. గ్రామ సభలో చదువుతున్న పేర్లలో ఎవరైనా అనర్హులు ఉంటే సభలోనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అనర్హుల పేర్లు తొలగించి మిగిలిపోయిన అర్హుల పేర్లను తిరిగి లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. ఒకవేళ జాబితాలో పేర్లు లేకుంటే ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. అర్హత ఉండి నిర్లక్ష్యంగా జాబితాలో పేర్లు లేకుంటే మాత్రం సంబంధిత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ ప్రాంతం నుండి ఒకప్పుడు వలసలు వెల్లేవారని, మహాత్మ గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పుడు సస్యశ్యామలంగా మారిందని గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేవలం వనపర్తి జిల్లాకే 175 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అనవసరంగా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని, పౌష్టికాహారం, తగిన వ్యాయామం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉండొచ్చన్నారు. పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా నాణ్యమైన బోధనలు అందించే ప్రభుత్వ పాఠశాలల్లో నే చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ సల్కలాపూర్ లో ఏర్పాటు చేసిన గ్రామ సభ ఒకప్పటి ప్రజాకోర్టును తలపిస్తుందనీ, ప్రజాకోర్టులో న్యాయ అన్యాయాలను విచారించినట్లె గ్రామ సభలో నిజమైన లబ్ధిదారుల ఎంపిక ప్రజల ఆమోదంతో రూపొందించడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకానికి అర్హత లేని వారి పేరు ఉంటే చెప్పాలని అందుకే జాబితా ప్రజల ముందు పెడుతున్నట్లు తెలియజేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఏదైనా జాబితాలో అనర్హులు ఉంటే చెప్పాలని, అదేవిధంగా అర్హత ఉండి పేర్లు లేని వారు ఇక్కడే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా భూములు లేని కూలీలకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కొత్తగా ప్రారంభించబోతున్నమనీ ఇందులో భాగంగా భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ నీ 5 వేల నుండి 10 వెలకు పెంచడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 కే సిలిండర్ వంటి ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం జరిగిందన్నారు. త్వరలో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక భారీ పరిశ్రమ రాబోతుందని, దీనిపై దావోస్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు ఇక్కడ ఒక బ్యాంకు ను, ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు. స్థానిక శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఆరు గ్యారంటీ కార్డును ప్రతి ఇంటికి పంపించి ఓట్లు అడగడం జరిగిందని దీనిని నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయడం వల్ల ఇప్పుడు అధికారంలో ఉన్నామని చెప్పారు. ఇచ్చిన హ్యారంటిల్లో ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 వేలకు పెంచడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 కే సిలిండర్ గ్యాస్, రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ అమలు చేయడం జరిగిందన్నారు. జనవరి 26 న మరో 4 పథకాలు ప్రారంభించబోతున్నట్లు సంక్షేమ పథకాల వివరాలు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నమని, ఉగాది నుండి రేషన్ కార్డు పై సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. సల్కలా పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామి ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు ఒక బ్యాంకు, ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేయాలని పార్లమెంట్ సభ్యులను కోరారు.
మామిడిమాడ రిజర్వాయర్ అవుతున్నందున పర్యాటక రంగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కోటి రూపాయలతో ఒక హరిత హోటల్ ను నిర్మించే విధంగా మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ నాలుగు సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని గుర్తించడానికి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇటీవల జరిగిన రైతు రుణమాఫీ లో సల్కలాపూర్ గ్రామ పంచాయతీకి 300 మంది రైతులకు 1.94 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా లో ఎకరానికి సంవత్సరానికి 12 వేల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని, అది వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ చదివే జాబితా తుది జాబితా కాదని అర్హత ఉండి పేర్లు లేకుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి, తహసిల్దార్, ఎంపీడీఓ, సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు . (Story : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics