క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
న్యూస్‌తెలుగు/ వనపర్తి : క్రీడల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఈ క్రమంలో నూతన స్టేడియాలను నిర్మిస్తూ… క్రీడకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో గత 5రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడా పోటీల విజేతలకు ఆయన గురువారం బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందని క్రీడలతో దేహదారుడెం లభించడమే గాక అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందవచ్చునని ఆయన అన్నారు
ఉన్నత విద్యతోపాటు క్రీడలపై దృష్టి సారించి యువత సన్మార్గంలో నడవాలని ఆయన సూచించారు
గ్రామంలో గత 5 రోజులుగా క్రీడలను నిర్వహించిన నిర్వాహకులు రాజశేఖర్ ఉదయ్ సతీష్ ధర్మేందర్లను ఎమ్మెల్యే అభినందించారు
కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి , గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి బాలచంద్రయ్య, రమేష్, మాజీ ఎంపిటిసి c. వెంకటయ్య పెద్ద శ్రీనివాస్ రెడ్డి, మణిగిల్లా తిరుపతి రెడ్డి, రవి, గట్టు యాదవ్ వెంకటేశ్వర్ రెడ్డి టైలర్ రవి, బాబిరెడ్డి, వివేక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట)