అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి :
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ వీవర్స్ కాలనీలో అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య లోపానికి ప్రధాన కారణమయ్యే డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు వెల్దురు గ్రామ వీవర్స్ కాలనీలో జిల్లా పరిషత్ నిధులనుంచి 7లక్షలు ఖర్చు చేసి అండర్ డ్రైనేజి నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పనులను నాణ్యవంతంగా వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామ, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి బాలచంద్రయ్య, రమేష్, మాజీ ఎంపిటిసి c. వెంకటయ్య మనిగిళ్ల తిరుపతిరెడ్డి గట్టు యాదవ్ వెంకటేశ్వర్ రెడ్డి టైలర్ రవి, బాబిరెడ్డి, వివేక్, పెద్దమందడి తాసిల్దార్, పంచాయతీరాజ్ AE కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story ; అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే)