రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ లో వనపర్తి ఢిల్లీ వరల్డ్ స్కూల్ బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభ
న్యూస్‌తెలుగు/వనపర్తి : హైదరాబాదులోని చింతల్ బ్రాంచ్ వారు నేడు నిర్వహించిన ఢిల్లీ వరల్డ్ స్కూల్ ఇంటర్ స్కూల్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ లో వనపర్తి ఢిల్లీ వరల్డ్ స్కూల్ బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రెండు కాంస్య పథకాలు సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సరిత సలోమి తెలిపారు. 11 నుండి 14 సంవత్సరాల కేటగిరిలో రిక్ ఇన్ లైన్ స్కేట్స్ వనపర్తి ఢిల్లీ వరల్డ్ స్కూల్ 7వ తరగతి విద్యార్ధి గౌతమ్ సాయి, 6వ తరగతి విద్యార్థి అఖిల్ చారి కాంస్య పథకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. ప్రతిభ కనబరిచి పథకాలు సాధించిన చిన్నారులను, వారికి శిక్షణ ఇచ్చిన పి ఈ టి అశోక్ రాచూరిని ప్రిన్సిపాల్ అభినందించారు. (Story : రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ లో వనపర్తి ఢిల్లీ వరల్డ్ స్కూల్ బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభ)