అనధికారిక సెలవుల్లో ఉంటున్న పంచాయతీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : శనివారం పానగల్ మండల పరిధిలోని అన్నారం తండా, కేతపల్లి, విపనగండ్ల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధుల్లో పాల్గొనకుండా అనధికారిక సెలవుల్లో ఉంటున్న పంచాయతి కార్యదర్శులపై, ఇతర సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ప్రతిరోజు పర్యవేక్షించాలని చెప్పారు. సర్వే చేస్తున్న సిబ్బంది వద్ద తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు సంబంధించిన ఇండ్ల జాబితా ఉండాలని, దాని ప్రకారమే సర్వే చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతిరోజు సర్వే సిబ్బంది తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పానగల్ మండల ఎమ్మార్వో సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో గోవిందరావు, వీపనగండ్ల ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. (Story : అనధికారిక సెలవుల్లో ఉంటున్న పంచాయతీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేయాలి)