గీతమ్స్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : సెమీ క్రిస్మస్ అంటే, క్రిస్మస్ పండుగకు ముందు జరుపుకునే పండుగ. క్రైస్తవులు సాధారణంగా క్రిస్మస్ పండుగకు ముందు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తారు. అని గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి అన్నారు. స్థానిక నరసరావుపేట రోడ్డులోని గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు దేవ దూతలు మరియు శాంతా క్లాస్ వేషధారణలతో మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. క్రిస్మస్ పండుగను క్రీస్తు పండుగ రోజు అని కూడా అంటారు. ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. క్రైస్తవుల విశ్వాసాల ప్రకారం, యేసు మానవాళిని పాపాల నుండి రక్షించడానికి భూమిపై అవతరించాడు. క్రిస్మస్ పండుగను ప్రేమ మరియు కరుణకు ప్రతీకగా భావిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : గీతమ్స్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు)

