గీతాంజలి స్కూల్స్ నందు ప్రారంభమైన
క్రిస్మస్ వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా ప్రా..రంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల వ్యవస్థాపకులు వై శేషగిరి రావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందించారు. చిన్నారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది జరుపుకునేటటువంటి పండుగల లో క్రిస్మస్ ఎంతో ప్రాముఖ్యమైనదని, కారణజన్ముడైన క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా క్రీస్తు మార్గంలో అందరూ నడిచి ప్రతి ఒక్క విద్యార్థి తోటి విద్యార్థుల పట్ల ప్రేమతో మెలగాలని అటులనే ప్రతి ఒక్క విద్యార్థి క్షమా దయ వంటి వాటిని అలవర్చుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు పలు క్రిస్మస్ గీతాలను ఆలపించి, క్రిస్మస్ విశిష్టతను తెలిపే పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వై లక్ష్మణ కిషోర్, ప్రిన్సిపల్ శ్రీమతి టి కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : గీతాంజలి స్కూల్స్ నందు ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు)