Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జెకె సిటీ ట్రస్ట్ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించిన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు

జెకె సిటీ ట్రస్ట్ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించిన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు

జెకె సిటీ ట్రస్ట్ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించిన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు

న్యూస్ తెలుగు/చింతూరు : నూర్ భాషా దూదేకుల మహాగర్జన రెండవ రోజు విజయవంతం గా ముగిసింది. తొలుత నూర్ భాషా దూదేకుల నూతన భవన్ ద్రోణం రాజు నగర్ పెందుర్తిలో శాసనసభపతి అయ్యన్నపాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎం కన్వెన్షన్ హాల్లో జరిగిన రెండవ రోజు శనివారం ఉమ్మడి విశాఖ జిల్లా దూదేకుల జన గర్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఇస్మాయిల్ వ్యవహరించారు. అనంతరం జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ 2025 క్యాలెండర్ మరియు డైరీను శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూదేకులు అనేది జాతి కాదని కేవలం వృత్తి మాత్రమే నిర్ణయించడం సరైనది కాదని అన్నారు. నాటి రోజుల్లో సిమ్మింగ్ మిల్స్ లేక దూదిని సేకరించి శుభ్రపరిచి దాని నుండి స్వచ్ఛంగా సేకరించిన దూదితో పరుపులు వంటి తయారు చేసే వృత్తిని ఎంచుకున్న ముస్లింలే నేటి నూర్ భాషా దూదేకులుగా పిలవబడుతున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్న నూర్ భాషాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నారు. న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారుక్ మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల మరియు ఉపాధి రంగాల్లో దూదేకుల వర్గం ఎంత వెనుకబడి ఉందని తమ ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన సంక్షేమ పథకాలను కేటాయిస్తామని గతంలో కూడా అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రతి ఒక్కరూ మహిళలతో సహా ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అప్పుడే ఆర్థిక స్వలంబన చేకూరి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. మాజీ శాసనమండలి చైర్మన్, రాష్ట్ర మైనార్టీ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల కొరకు తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమరపరిచేందుకుగాను ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ స్కీం లను కూడా ప్రవేశపెట్టనుందన్నారు. అనంతరం జమాల్ ఖాన్ మాట్లాడుతూ మనమందరం ఓకే తల్లి బిడ్డల కలిసి ఉండాలని వర్గ విభేదాలు ఇస్లాం ధర్మాన్ని కాపాడాలని సోదర భావంతో ప్రతి ఒక్కరు జీవనం కొనసాగిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు. అందరూ మతసామరస్యాన్ని కలిగి ఉండాలని, పరమత సహనం పరస్పర సహకారంతోనే ప్రేమతోనే ఎదుటివారిని జయిస్తామని ఈ సందర్భంగా నూర్ భాషాలకు విన్నవించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నాగులుమీరా, నూర్ భాషా రాష్ట్ర సంఘం అధ్యక్షులు పీర్ మొహమ్మద్, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు డి. మస్తానమ్మ, టిడిపి నూరు భాష ముస్లిం సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ సుభాన్, ఉమర్ ముక్తార్, బాజీ, జెకె సెట్ ట్రస్ట్ సభ్యులు రాచూరి చంద్రశేఖర్, జావేద్, విక్కి రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుండి వచ్చిన దూదేకుల నూర్ భాషా సంఘ నాయకులు తదితరులు హాజరైనారు.(Story : జెకె సిటీ ట్రస్ట్ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించిన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!