ముగిసిన ఇంధన పొదుపు వారోత్సవాలు
విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి
ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు
న్యూస్‌తెలుగు/విజయనగరం : విద్యుత్తును పొదుపు చేయడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి విద్యుత్తును పొదుపు చేసి భవిష్యత్తు తరాలకు ఉజ్వల భవిష్యత్తును అందజేయాలని ఏపీ ఈపీడీసీఎల్ సూపరిండెంట్ ఇంజనీర్ లక్ష్మణరావు అన్నారు.జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం విజయనగరం సర్కిల్ దాసన్నపేట విద్యుత్ భవనంలో ముగింపు వారోత్సవాలు జరిగాయి.ఈ సందర్భంగా ఎస్ఈ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు అందరు బాధ్యతనిదీనిని చిన్న పెద్ద అందరూ కూడా పాటించాలని పిలుపునిచ్చారు. అనవసరంగా విద్యుత్తును వృధా చేయడం వల్ల రానున్న కాలంలో ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఏటా జరిగా ఈ విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించి గ్రామస్థాయిలో ఉండే ప్రజలను సైతం విద్యుత్ పొదుపుపై వివిధ రూపాలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు విజయనగరం టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీ. త్రినాధరావు మాట్లాడుతూ ఇంధన పొదుపు ఆవశ్యకతను పిల్లలకు వివరించారు.ఈ కార్యక్రమం అనంతరం వ్యాసరచన చిత్రలేఖనం పోటీలలో విజేతలైన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు సూపరింటెండింగ్ ఇంజనీర్ లక్ష్మణరావు చేతుల మీదుగా బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం సర్కిల్ డిజియం కె. వి. లక్ష్మీనారాయణ,ఎస్ఎఓ వి. రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి.మురళికృష్ణ,జీ.సురేష్ బాబు, కె వి సత్యన్నారాయణ,అనంతరావు తదితరులు పాల్గొన్నారు. (Story :ముగిసిన ఇంధన పొదుపు వారోత్సవాలు)