UA-35385725-1 UA-35385725-1

మాదక ద్రవ్యాల ప్రచారానికి వినియోగించనున్న సంకల్పం గీతం

మాదక ద్రవ్యాల ప్రచారానికి వినియోగించనున్న సంకల్పం గీతం

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/విజయనగరం : మాదక ద్రవ్యాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టి, ప్రజలను మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ చైతన్యపరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకుగాను ప్రత్యేకంగా రూపొందించిన ‘సంకల్పం’ గీతాన్ని, పోస్టర్లును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసుశాఖలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ, వ్యసనపరులుగా మారుతున్న యువతను మత్తు, మాదక ద్రవ్యాలకు దూరం చేయడానికి జిల్లా పోలీసుశాఖ తమవంతు కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ‘సంకల్పం’ కార్యక్రమాన్ని చేపట్టి, తరుచూ సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని కళాశాలలను సందర్శించి, యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు స్నేహాల ప్రభావం, ఒత్తిడితో డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడవద్దని, ‘బీ స్మార్ట్ – డోన్ట్ స్టార్ట్’ అన్న నినాదంతో యువతను ఒక్కసారి కూడా డ్రగ్స్ వినియోగించకుండా ఉండడమే శ్రేయస్కరమని కోరుతున్నామన్నారు.
ఈ సంకల్పం కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకుగాను పట్టణానికి చెందిన కాకర్ల గాంధీ మాష్టరు రచన, స్వర కల్పన, గానం చేసి, సంగీతాన్ని అందించి, ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని ఆవిష్కరించామన్నారు. ఈ గీతాన్ని ఇకపై సంకల్పం ప్రచార కార్యక్రమంలోను, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోను, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ ను వినియోగించనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం, సంకల్పం గీతాన్ని రచన, స్వరకల్పన, గానం చేసి, సంగీతాన్ని అందించిన కాకర్ల గాంధీని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, సాలువతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను, సర్టిఫికేటును అందజేసారు. అదే విధంగా నెల్లిమర్ల మిమ్స్ కళాశాలలో ‘సంకల్పం’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సమర్ధవంతంగా పని చేసిన నెల్లిమర్ల ఎస్ఐ బి.గణేష్ ను కూడా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేసారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, ఎస్బీ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, నెల్లిమర్ల ఎస్ఐ బి.గణేష్, కాకర్ల గాంధీ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : మాదక ద్రవ్యాల ప్రచారానికి వినియోగించనున్న సంకల్పం గీతం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics
UA-35385725-1