పెబ్బేరు సంత భూమిని మున్సిపాలిటీకి అప్పగించండి
న్యూస్‌తెలుగు/వనపర్తి : దేశంలోని అతిపెద్ద సంతగా పేరుగాంచిన పెబ్బేరు సంత,ఇట్టి భూమి సుగురు సంస్థాన దీశులు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి 30.19 గుంటల భూమి ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది అండదండలతో కొంతమందికి ఓ ఆర్ సి ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని శుక్రవారం
ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి కి పెబ్బేరు సంత స్థలాన్ని పెబ్బేరు మున్సిపాలిటీకి ఇవ్వాలని దీని ద్వారా సంత ద్వారా రెండువేల కుటుంబాలు పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలు జీవిస్తున్నారని ఎన్నో రాష్ట్రాల నుంచి ఈ సంతలో వ్యవసాయ ఉత్పత్తులు అనేక విధాలుగా వ్యాపారం నడుస్తుందని తదితర అంశాలను వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విషయాన్ని డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి స్పందిస్తూ ఉన్నత అధికారులకు ఇట్టి విషయాన్ని తమ ద్వారా తెలియజేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారుపాకుల వెంకట్ రాములు యాదవ్.పెబ్బేరు సంత పరిరక్షణ సమితి సభ్యులు గోనెల బాలస్వామి సాయి రెడ్డి సహదేవుడు సంత పరిరక్షణ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (Story : పెబ్బేరు సంత భూమి ని మున్సిపాలిటీకి అప్పగించండి)