పెబ్బేరులో పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు పట్టణములో బి.ఆర్.ఎస్ నాయకులు రామపురం మాజీ సర్పంచ్ గోపాల్ గృహప్రవేశ వేడుకలలో , డబల్ బెడ్ రూమ్ సముదాయంలో బి.ఆర్.ఎస్ కార్యకర్త బజారు.బాలకృష్ణ గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు పూజలు నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఈరోజు పెబ్బేరు పట్టణములో కార్యకర్త గృహప్రవేశానికి హాజరు కావడానికి వెళుతుండగా వడ్ల మహేశ్వర్ చారి వడివడిగా వచ్చి సార్ మీ హయాములో నేను డబల్ బెడ్ రూమ్ పొందినాను ఫించన్ 4000తదితర సంక్షేమ పథకాల పొంది చింత లేకుండా హాయిగా ఉన్నాను అని ముఖులిత హస్తాలతో చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
మహేష్ చారిని నిరంజన్ రెడ్డి ఆప్యాయంగా భుజం తట్టి ధైర్యము చెప్పి అండగా ఉంటానని అన్నారు. పెబ్బేరు పట్టణ మైనార్టీ నాయకులు మాజిద్ జన్మదినం సందర్భంగా నిరంజన్ రెడ్డి , బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సార్ గారు బర్త్ డే కేక్ కట్ చేసి మాజీద్ కు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వనం.రాములు, కర్రెస్వామి,దిలీప్ రెడ్డి,శంకర్నా యుడు,పెద్దింటి.వెంకటేష్,విశ్వరూపం,రాజశేఖర్,కౌన్సిలర్స్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : పెబ్బేరులో పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి)