ప్రమాదంలో మృతి చెందిన తండ్రి, కూతురు కుటుంబానికి నివాళులు అర్పించిన మంత్రి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పెనుకొండ మండలం రోద్దం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్ ఈనెల ఆరవ తేదీ రోడ్డు ప్రమాదంలో రమేష్ తో పాటు కూతురు భవిత కూడా మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న మంత్రి తన ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబుకు సమాచారాన్ని అందించారు. తదుపరి హరీష్ బాబు ధర్మారం పట్టణంలోని పోతుకుంట రోడ్డు లో గల వారి ఇంటికి స్వయంగా వెళ్లి, మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని హరీష్ బాబు తెలిపారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా రమేష్ భార్యను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డోల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రమాదంలో మృతి చెందిన తండ్రి, కూతురు కుటుంబానికి నివాళులు అర్పించిన మంత్రి )