చేనేత క్రికెట్ టోర్నమెంట్ :సందా రాఘవ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల ఆరవ తేదీ ధర్మవరం చేనేత క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు సంధా రాఘవ బ్రదర్స్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి బహుమతి లక్ష రూపాయలు, రెండవ బహుమతి 50వేల రూపాయలు, మూడవ బహుమతి 20వేల రూపాయలు, నాలుగవ బహుమతి పదివేల రూపాయలు విజేతలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ టోర్నమెంట్కు సహకరించిన దాతలైన చందు, జనార్ధన్, పురుషోత్తం, శశాంక్, చౌడయ్య, విశ్వనాథ్, మూర్తిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆసక్తిగల క్రికెట్ క్రీడాకారులు అన్నం సాయినాథ్ సెల్ నెంబర్ 970065 3520కు గానీ, భరత్ కుమార్ 733771475 గాని, ఫయాజ్ 7780595596 గాని సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. (Story : చేనేత క్రికెట్ టోర్నమెంట్ :సందా రాఘవ)