రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థి ఎంపిక
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గత నెల 23 వ తేదీన అనంతపురం ఆర్ డి టి స్టేడియంలో లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలో ధర్మవరం జీవన్ జ్యోతి స్కూల్ విద్యార్థి యస్. శబరీష్ గౌడ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఎస్. జి.ఎఫ్ అండర్17 హాకీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి ఈ నెల 3వ తేదీ నుంచి 5 వ తేది వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నెల్లూరు లో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో అనంతపురం జిల్లా తరఫున పాల్గొంటారు అని తెలియజేశారు. ఎపికైన విద్యార్థి ని పాఠశాల హెడమిస్టర్ సిస్టర్ సుజాత ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, బోధ నేతర సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story ; రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థి ఎంపిక)