డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం బి ఎ, బీకాం, బిఎస్సి లలో స్పాట్ అడ్మిషన్ పొందడానికి ఈ నెల 26వ తేదీ వరకు గడు వెలిగించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు గడువు పెంచినందుకు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇంతకు మునుపు రిజిస్ట్రేషన్ చేయించు కోని విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకొని అనివార్య కారణాల రిత్యా కళాశాలలో చేరకుండా వున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ స్పాట్ అడ్మిషన్లలో చేరిన వారికి ప్రభుత్వం నుంచి లభించే ఎలాంటి స్కాలర్ షిప్పులు లభించవని తెలిపారు. బి ఎ పొలిటికల్ సైన్స్; బీకాం కంప్యూటర్స్; బిఎస్సి కంప్యూటర్స్ లో చేరుటకు స్పాట్ అడ్మిషన్ లో సదుపాయం ఉన్నందున ఆసక్తి కలిగి కళాశాలలో చేరదలచినవిద్యార్థినీ , విద్యార్థులు ఈనెల 26వ తేదీలోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరయి, తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చుదిద్దుకోగలరని తెలిపారు. (Story : డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు)