UA-35385725-1 UA-35385725-1

సబ్సిడీ రుణాలు వారం రోజుల్లో గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి

సబ్సిడీ రుణాలు వారం రోజుల్లో గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : 2018-19 లో స్వయం ఉపాధి కొరకు ఎస్సి, ఎస్టి, మైనారిటీ శాఖల ద్వారా మంజూరు అయిన సబ్సిడీ రుణాలు వారం రోజుల్లో గ్రౌండింగ్ అయ్యే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంక్షేమ శాఖల అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్ తో ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాకపోవడానికి గల కారణాల పై సమీక్ష నిర్వహించారు.
ఒక్కో శాఖ ద్వారా సంవత్సరం వారీగా స్వయం ఉపాధికి మంజూరు అయిన రుణాలు, గ్రౌండింగ్ అయిన వివరాలు, ఇంకా మిగిలిపోయిన వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడానికి ఎస్సి, ఎస్టీ, మైనారిటీ శాఖల ద్వారా 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేసి సబ్సిడీ రూపాయలు అడ్వాన్సుగా బ్యాంకులో జమ చేసినప్పటికీ కేవలం 20 శాతం రుణం ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ప్రశ్నించారు. 2018-19 సంవత్సరం వారీగా, లబ్ధిదారుని వారీగా రుణం గ్రౌండింగ్ కాకపోవడానికి గల కారణాలు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని సంక్షేమ శాఖల అధికారులను, లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా తీసుకొని గ్రామం వారీగా మండల అభివృద్ధి అధికారులు బాధ్యత తీసుకొని వారం పది రోజుల్లో అన్ని రకాల రుణాలు గ్రౌండింగ్ అయ్యే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డ్యూయల్ అకౌంట్ తెరవని లబ్ధిదారునికి వెంట ఉండి అకౌంట్ ఓపెన్ చేయించే విధంగా గ్రామీణాభివృద్ధి శాఖ సి.సి.లకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, గ్రామీణాభివృద్ధి శాఖ పి.డి. ఉమాదేవి, జడ్పి సీఈఓ యాదయ్య, ఆర్డీఓ పద్మావతి, ఈ.డి. ఎస్సి కార్పొరేషన్ మల్లికార్జున్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి నుషిత, బి.సి. సంక్షేమ శాఖ అధికారి సుబ్బారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. (Story : సబ్సిడీ రుణాలు వారం రోజుల్లో గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1