ప్రభుత్వ చౌక ధాన్యం దుకాణాలను ప్రారంభం
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయిజిల్లా) : పట్టణంలోని తొమ్మిదవ వార్డ్ నాగుల బావి వీధిలోని లల్లి భగవాన్, 29 వ వార్డు డిఎల్ఆర్ కాలనీలోని సరితాళ దస్తగిరి, 32వ వార్డు గిర్రాజ కాలనీలోని సాయినాథరెడ్డిల నూతన ప్రభుత్వ చౌక ధాన్యం దుకాణాలు (ఎఫ్ పి) లను ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయా వార్డులోని మహిళలు తండోపతండాలుగా వచ్చి హారతులు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు. డీలర్గా అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ వారికి, డీలర్లు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు నిత్యవసర సలకు ఇవ్వడంలో ఎలాంటి అవకతవకలు ఉండరాదని, ప్రతి ఒక్కరూ మంచి గుర్తింపు తెచ్చేలా కృషి చేయాలని తెలిపారు. తదుపరి ఆ వార్డులోని కొంతమంది వృద్ధులు తమకు అన్ని అర్హతలు ఉన్నా కూడా పెన్షన్లు రాలేదని కంటితడి పెట్టడంతో, స్పందించిన చిలకం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేలా తప్పక పంపిణీ చేస్తానని తెలిపారు.
ఆర్ సి జి మాలును ప్రారంభించిన చిలకం
పట్టణంలోని కే పి టి వీధి వరలక్ష్మి థియేటర్ నందుగల ఆర్సిజి మాల్ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఆ నాణ్యమైనదే మాలుకు మంచి గుర్తింపు వస్తూ దినదినాభివృద్ధి చెందుతుందని తెలిపారు. తదుపరి రెస్టారెంట్ లోని పలు వంటకాల రుచులు చూసి తృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఆర్సిజి మాలను సందర్శించి మాల్ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : ప్రభుత్వ చౌక ధాన్యం దుకాణాలను ప్రారంభం)