UA-35385725-1 UA-35385725-1

 “క” సినిమా నుంచి ‘మాస్ జాతర’ సాంగ్ 

 “క” సినిమా నుంచి ‘మాస్ జాతర’ సాంగ్ 

న్యూస్ తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:  యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

“క” సినిమా నుంచి ‘మాస్ జాతర ‘ సాంగ్ ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 10.05 ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించిన “క” సినిమా నుంచి ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ సాంగ్ ఇప్పటికే రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘మాస్ జాతర’ సాంగ్ మీద కూడా మ్యూజిక్ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

“క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్ (Stry :  “క” సినిమా నుంచి ‘మాస్ జాతర’ సాంగ్ ) 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1