దళితులను అవమానించడమే వంద రోజులు గిఫ్టా
న్యూస్‌తెలుగు/విశాఖపట్నం : అంబేద్కర్ ఫ్లెక్సిని చించేసిన ఊండీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుని, డాక్టర్ ఉమామహేశ్వరరావుని కులం పేరుతో దూషించి, ఆయన పై దాడి చేసిన జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ(ఏఎంఎస్) దళిత హక్కుల పోరాట సమితి (డీ హెచ్ పి ఎస్) భీమ్ సేన వార్ ,కెవిపిఎస్ మరియు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.
మంగళవారం వివిధ దళిత సంఘాలు ఎల్ఐసి కూడలి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వైఖరి ప్రజల మధ్య కుల మత ఘర్షణలు సృష్టించేలా ఉన్నాయని ,ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యని అన్నారు. అదేవిధంగా ఏటూరిపాడులో గుడికి వెళ్లే దారిలో అంబేద్కర్ ఫ్లెక్సీ ఉందని, దాన్ని స్వయంగా ఎమ్మెల్యే తన చేతులతోనే చించి వేయడమే కాకుండా ఇదే మసీద్ దగ్గరో ,చర్చి దగ్గరో పెడితే ఊరుకుంటారా అని మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలాగా ఓ ప్రజా ప్రతినిధి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత ఫోటోను చించడమే కాకుండా ప్రజల మధ్య దర్శనం చిచ్చు పెట్టడం దారుణం అన్నారు. హైకోర్టు సుమోటోగా ఈ కేసును నమోదు చేయాలని కోరారు. ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రంగరాయ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్ దళితుడైన డాక్టరు ఉమామహేశ్వరరావుని నోటికి వచ్చినట్టు దూషించి దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే దురాహంకార వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . ఈ విషయమై కూటమి నాయకులు వెంటనే స్పందించాలన్నారు. కాకినాడ ఎస్పి ,కలెక్టర్ కేసు నమోదు చేసి అరెస్టు చేయకుండా రాజీ కుదర్చ డం సిగ్గుచేటని, ఎస్పీని కలెక్టర్ ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్పందించకపోవడం దారుణం అన్నారు. దళిత మహిళ అయిన హోమ్ మంత్రి అనిత వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు కళ్యాణ్ రావు ,పి గౌతమ్, సత్యనారాయణ, డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్, ఎస్.రాజులు,
వివిధ సంఘాల నేతలు పాకా సత్యనారాయణ, కస్తూరి వెంకటరావు , ఎస్.సుధాకర్,
కే చిన్నారావు, డాక్టర్ రాజేంద్రప్రసాద్,
ఎస్సార్ వేమన ఈశ్వరరావు, మాటూరి శ్రీనివాసరావు ,డాక్టర్ కె గణపతి, తాడి కాంతారావు ,సురేష్ కుమార్, కి చిరంజీవి టీ రాజు సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. (Story : దళితులను అవమానించడమే వంద రోజులు గిఫ్టా)