తెలుగు వెలుగు నంది జాతీయ పురస్కారం అందుకున్న రేవతి
న్యూస్‌తెలుగు/వినుకొండ : ఆదివారం విజయవాడ బాలోత్సవ భవన్ లో కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూఢిల్లీ శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి మరియు తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన సభలో సాహితీవేత్తలు ముఖ్యఅతిథిగా కత్తి వెంకటేశ్వర్లు ఝాన్సీ లక్ష్మీబాయి మనమరాలు శాంతి భాయ్ మరియు నాగరాజు కే నాగేశ్వరరావు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ చైర్మన్ రాజ్ కుమార్ ఏ నాగరాజు చేతుల మీదగా అమృతపూడి రేవతి కి ఘనంగా పూలమాలలు దృశ్యాలవులతో సత్కరించి నంది పురస్కార పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో వినుకొండకు చెందిన జాషువా కవి పుట్టిన గడ్డపై పుట్టిన అమృతపుడి రేవతి మహిళగా కవిత్రిగా సాహితీ మరియు సామాజిక సేవా రంగాలలో విశిష్టమైన కృషి చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని తెలిపారు నంది పురస్కారం అందుకున్న రేవతి కి వినుకొండ పట్టణానికి చెందిన కమలా రామ్ అమృతపూడి విజయరాజు రవీంద్రబాబు మంద వెంకట్రావు ప్రముఖులు రాజకీయ నాయకులు న్యాయవాదులు కవులు కళాకారులు పలువురు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. (Story : తెలుగు వెలుగు నంది జాతీయ పురస్కారం అందుకున్న రేవతి)