సీజన్ వ్యాధుల పట్ల అవగాహన పెంచాలి
జిల్లా వైద్య అధికారి
న్యూస్ తెలుగు /ములుగు :
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా గల 81 ప్రభుత్వ బాలుర, బాలికల వసతి గృహాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని ములుగు జిల్లావైద్య అధికారి అల్లెం అప్పయ్య ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి వసతి గృహాలలో వైద్య శిబిరం నిర్వహించే ముందు, బాలుర, బాలికలతో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహనను పెంపొందించిన, తరువాతనే ,వైద్య శిబిరాన్ని నిర్వహించి పిల్లలకు చికిత్స చేయాలని, వైద్య అధికారులను ఆదేశించారు. వైద్య శిబిరాల పర్యవేక్షణ కొరకు జిల్లా వ్యాప్తంగా నలుగురినీ, జిల్లా ప్రోగ్రాం అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.మంగపేట మండలానికి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ విపిన్ కుమార్ ,వెంకటాపురం వాజేడు మండలాలకు, డాక్టర్ క్రాంతి కుమార్, తాడ్వాయి మండలానికి, డాక్టర్ శ్రీకాంత్, ములుగు, వెంకటాపూర్ మండలాలకు డాక్టర్ రణధీర్ ,గోవిందరావుపేట్ మండలానికి డాక్టర్ భవ్య శ్రీ లను నియమించడం జరిగిందన్నారు. చల్వాయి లోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ డిగ్రీ, ఇంటర్మీడియట్ పిల్లల వసతి గృహాన్ని, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పదవ తరగతి వరకు గల , గోవిందరావుపేట్ లలో, వైద్య క్యాంపులను తనిఖీ చేశామన్నారు. హాస్టల్ లోని పిల్లలను ఉద్దేశించి అయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులను అరికట్టే విధానాన్ని పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతను గురించి చెప్పడంతో పాటు, మంచిగా చదువుకొని , ఉన్నత పదవులను అధిరోహించి, సమాజ శ్రేయస్సుకు దోహదపడాలని పిల్లలకు,సూచించారు. జిల్లా వ్యాప్తంగా 83 క్యాంపులు నిర్వహించమన్నారు.అందులో 13927 గాను 5253 పిల్లలను పరీక్షించమని, 311 జ్వరాలు ఉన్న పిల్లలలు గా గుర్తించి, వారి కి, ఆర్ డి టి మలేరియా డెంగ్యూ టెస్టులను చేయడం తో పాటు చికిత్స ను కూడా అందించామని చెప్పారు. (Story : సీజన్ వ్యాధుల పట్ల అవగాహన పెంచాలి)