విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెచ్చా సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని గోవిందమ్మ సహకారం అందించారు. భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా సేవా సంఘం వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అవ్వారు కోటేశ్వరరావు, సుబ్బయ్య శర్మ, రామలింగేశ్వరరావు, పి నారాయణ రావు, పి రాము,టి.శేషయ్య, గోపీచంద్ బి. పి.ఎస్. సుందర రావు, నాగేంద్రుడు, బాలాజీ సింగ్, దీక్షితులు, శంకరరావు, ఎం.వి శర్మ, కృష్ణమూర్తి, రాఘవయ్య, వెంకటస్వామి, సిహెచ్ రఘు తదితరులు పాల్గొన్నారు. (Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం.)