Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చింతూరు డిగ్రీ కాలేజీలో మినీ జాబ్ మేళా విజయవంతం

చింతూరు డిగ్రీ కాలేజీలో మినీ జాబ్ మేళా విజయవంతం

చింతూరు డిగ్రీ కాలేజీలో మినీ జాబ్ మేళా విజయవంతం

న్యూస్ తెలుగు/చింతూరు: చింతూరు డిగ్రీ కాలేజీ లో జాబ్ మేళా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్.మణిమాల తెలిపారు. ఈ జాబ్ మేళాలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అపోలో టైర్స్ లిమిటెడ్ మరియు ఫాక్స్ కాన్ ప్రముఖ కంపెనీలు హాజరయ్యారని తెలిపారు. ఈ జాబ్ మేళాకు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకుల నుంచి విశేష స్పందన లభించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ మినీ జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు.ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ సరైన ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ జాబ్ మేళా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ ముల్లి. శేఖర్ మాట్లాడుతూ యువత ఇటువంటి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 34 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనగా,కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం 14 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ కార్యక్రమం ద్వారా 14 మందికి ఉద్యోగ అవకాశాలు లభించడం పట్ల ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ధనేష్ వర్మ,డా.వై. పద్మ, ఎం. రాకేష్ రాజ్, ఎం.దివ్య జ్యోతి, జె. శివకృష్ణ, కె. సత్య గణేష్, డా. జి ఝాన్సీ, జి.సాయికుమార్ బి.శ్రీనివాసరావు , ఎన్. ఆనంద్, కే. లక్ష్మీ ప్రసన్న, కే. కీర్తి తృతీయ సంవత్సర విద్యార్థులు పాల్గొన్నారు. (Story: చింతూరు డిగ్రీ కాలేజీలో మినీ జాబ్ మేళా విజయవంతం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments