Homeవార్తలుఉత్పత్తి స్థాయిలో జెన్ ఏఐని  57% సంస్థలు వినియోగిస్తున్నాయి: క్వాలిజీల్ హెచ్‌ఎఫ్‌ఎస్‌

ఉత్పత్తి స్థాయిలో జెన్ ఏఐని  57% సంస్థలు వినియోగిస్తున్నాయి: క్వాలిజీల్ హెచ్‌ఎఫ్‌ఎస్‌

ఉత్పత్తి స్థాయిలో జెన్ ఏఐని  57% సంస్థలు వినియోగిస్తున్నాయి, కానీ కేవలం 15% మాత్రమే ఏఐ టెస్టింగ్ కోసం ప్రత్యేక విధానాన్ని కలిగి ఉన్నాయని కనుగొన్న కొత్త క్వాలిజీల్ హెచ్‌ఎఫ్‌ఎస్‌ పరిశోధనా అధ్యయనం

101 మంది యుఎస్ ఎంటర్‌ప్రైజ్ క్వాలిటీ, టెక్నాలజీ లీడర్లపై జరిపిన అధ్యయనంలో, ప్రొడక్షన్‌లో ఏఐని వినియోగిస్తోన్న 37% సంస్థలలో ఏఐ నాణ్యతకు బాధ్యత వహించే నిర్దిష్ట విభాగం ఏదీ లేదని తేలింది.

ముంబై, నవంబర్ 2026: ట్రస్ట్-ఫస్ట్, ఏఐ -ఆధారిత క్వాలిటీ ఇంజనీరింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న క్వాలిజీల్ , ప్రముఖ అంతర్జాతీయ పరిశోధన, సలహా సంస్థ అయిన హెచ్‌ఎఫ్‌ఎస్‌ రీసెర్చ్, ఇటీవల ‘హెచ్‌ఎఫ్‌ఎస్‌ టేక్ 5 x క్వాలిజీల్ ‘ అనే సంయుక్త పరిశోధనా అధ్యయనాన్ని నిర్వహించాయి. ఉత్పత్తి స్థాయిలో ఏఐ వ్యవస్థలను ధ్రువీకరించేందుకు సంస్థలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? ఏఐ యుగంలో క్వాలిటీ ఇంజినీరింగ్‌ (క్యూఈ) ఏ విధంగా పరిణామం చెందాలి? అనే అంశాలను ఈ అధ్యయనం పరిశీలించింది. ఇందుకోసం అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నాణ్యత, సాంకేతిక రంగాల 101 మంది నాయకులను సర్వే చేశారు.

సంస్థలలో ఏఐ స్వీకరణ పెరుగుతున్న వేగానికి, దాని నాణ్యతకు భరోసా కల్పించే వ్యవస్థల అభివృద్ధికి మధ్య అంతరం పెరుగుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. 57% సంస్థలు జెనరేటివ్ ఏఐ ని ఏదో ఒకరూపంలో ఉత్పత్తి స్థాయిలో వినియోగిస్తుండగా, 36 శాతం సంస్థల్లో ఏజెంటిక్‌ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏఐ ధ్రువీకరణకు సంబంధించిన అధికారిక విధానాలు ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. కేవలం 15% సంస్థలు మాత్రమే ఏఐ పరీక్ష కోసం ప్రత్యేకంగా రూపొందించిన విధానాన్ని కలిగి ఉండగా, 52% సంస్థలు డిటర్మినిస్టిక్ సాఫ్ట్‌వేర్ కోసం రూపొందించిన ఫ్రేమ్‌వర్క్‌లను ఉపయోగించి ప్రాబబిలిస్టిక్ ఏఐ  సిస్టమ్‌లను పరీక్షిస్తున్నాయి. ఏఐ  మరింత స్వయంప్రతిపత్తి గలదిగా , వ్యాపారానికి అత్యంత కీలకమైనదిగా మారుతున్న కొద్దీ, సంప్రదాయ క్యూఈ (క్వాలిటీ ఎవాల్యుయేషన్) నుండి ట్రస్ట్ ఇంజనీరింగ్ వైపు మార్పు జరుగుతోందని ఈ అధ్యయనం సూచిస్తోంది.

ఈ భాగస్వామ్యం పై క్వాలిజీల్ సహ-వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ కళ్యాణ్ కొండా మాట్లాడుతూ  “సంస్థలు ఏఐ ని ఉత్పత్తి దశలోకి తీసుకురావడంలో చూపిన వేగంతో పోలిస్తే, దానిని నియంత్రించే క్రమశిక్షణను అభివృద్ధి చేసుకోవడంలో అంత వేగాన్ని ప్రదర్శించలేదు. ఈ అధ్యయనం ప్రకారం, ఉత్పత్తి స్థాయిలో ఏఐని వినియోగిస్తున్న 37 శాతం సంస్థల్లో దాని నాణ్యతకు బాధ్యత వహించే ప్రత్యేక విభాగం లేదు. సంస్థలు తమ ఏఐ కార్యక్రమాలను విస్తరిస్తున్నప్పుడు స్పష్టమైన జవాబుదారీతనం, అలాగే ప్రయోజనానికి తగిన ధృవీకరణ ఎందుకు అవసరమో ఇది నొక్కి చెబుతోంది”అని అన్నారు.

ఈ అధ్యయనం ప్రకారం, కచ్చితత్వం నిరూపించబడింది కానీ విశ్వసనీయత నిరూపించబడలేదు. 88% సంస్థలు మోడల్ కచ్చితత్వాన్ని కొలుస్తుండగా, చాలా తక్కువ సంస్థలు నిష్పాక్షికతను (47%), వివరణాత్మకతను (37%), లేదా నియంత్రణ సమ్మతికి సంబంధించిన సాక్ష్యాలను (35%) అందిస్తున్నాయి.

ఈ అధ్యయన ఫలితాల గురించి క్వాలిజీల్ సహ-వ్యవస్థాపకులు , ఇండియా ఆపరేషన్స్ హెడ్ మధు మూర్తి మాట్లాడుతూ, “గతంలో, ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ నాణ్యతకు భరోసా కల్పించడంపైనే దృష్టి ఉండేది. ఇప్పుడు సంస్థల వ్యవస్థల్లో ఏఐ అంతర్భాగంగా మారడంతో, ఏఐ మేధస్సుకు కూడా నాణ్యతా భరోసా కల్పించాల్సిన బాధ్యత మాపై పడుతోంది. ఈ పరివర్తనలో క్వాలిటీ ఇంజనీర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంది. 82% సంస్థలు క్వాలిటీ ఇంజనీర్ పాత్ర గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాయని ఈ అధ్యయనం చూపిస్తుంది. అందుకే మేము ఏఐ నైపుణ్యం ఉన్న క్వాలిటీ ఇంజనీర్ల పై పెట్టుబడి పెడుతున్నాము” అని అన్నారు.

ఈ అధ్యయనం ప్రకారం, క్యూఈకు బడ్జెట్ లేకుండానే బాధ్యతలు అప్పగించబడ్డాయి, కేవలం 24% సంస్థలు మాత్రమే ఈ విస్తరించిన బాధ్యతలకు అనుగుణంగా వనరులు కేటాయిస్తున్నట్లు  నివేదించాయి. QMentisAI, ValidAIteలతో కూడిన క్వాలిజీల్ యొక్క ఏఐ ఎకోసిస్టమ్, ఏఐ -ఆధారిత నాణ్యత, ఏఐ హామీని సంస్థల డెలివరీ, గవర్నెన్స్ పైప్‌లైన్‌లలో పొందుపరచడం ద్వారా ఈ అంతరాన్ని పూడ్చడంలో సంస్థలకు సహాయపడటానికి రూపొందించబడింది.

“చాలా సంస్థలు తమ ఏఐ కచ్చితమైనదని నిరూపించగలవు. కానీ అది నిష్పక్షపాతంగా, వివరించదగినదిగా లేదా నిబంధనలకు అనుగుణంగా ఉందని చాలా తక్కువ సంస్థలు మాత్రమే నిరూపించగలవు. నియంత్రణ సంస్థలు, ఆడిటర్లు , వినియోగదారులు పరీక్షించేది ఈ అంశాలనే. ఏఐని ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లడానికి కచ్చితత్వం ఉపయోగపడుతుంది. కానీ దాన్ని విస్తరించడానికి విశ్వసనీయత అవసరం,” అని హెచ్‌ఎఫ్‌ఎస్‌ రీసెర్చ్ ప్రాక్టీస్ లీడర్ హన్సా అయ్యంగార్ అన్నారు.

నివేదికను https://qualizeal.com/insights/reports/hfs-take-5-report-reliable-ai-requires-trust-engineering/ వద్ద  డౌన్‌లోడ్ చేసుకోండి (Story: ఉత్పత్తి స్థాయిలో జెన్ ఏఐని  57% సంస్థలు వినియోగిస్తున్నాయి: క్వాలిజీల్ హెచ్‌ఎఫ్‌ఎస్‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments