ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదం వంటి గింజలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ముందస్తు చర్యలు మీ ప్లేట్లోనే ప్రారంభమవుతాయి.
నవంబర్ 9 2026: మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు.
ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2023లో ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)–ఇండియాబ్ అధ్యయనం ప్రకారం, దేశంలో సుమారు 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మరో 136 మిలియన్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారు. అంటే మన జనాభాలో అధిక సంఖ్యలో ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన దశలో ఉన్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారపు అలవాట్లు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి.
అందుకే రోజువారీ ఆహార పదార్థాల ఎంపికలతోనే ఈ దిశగా ఆచరణాత్మక చర్యలు ప్రారంభించవచ్చు. ఇందులో కాలిఫోర్నియా బాదం పప్పుల వంటి నట్స్ కూడా భాగం కావచ్చు. బాదంపప్పుల్లో ఉండే ప్రత్యేక పోషక గుణాలు, ముఖ్యంగా ప్రొటీన్ (6 గ్రాములు), ఫైబర్ (3 గ్రాములు) వంటివి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయుల అదుపులో వుంచుకోవటానికి ఇవి ఒక సహజమైన ఆహార ఎంపికగా నిలుస్తాయి.
ఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్, డైటెటిక్స్ రీజనల్ హెడ్ రితికా సమద్దార్ మాట్లాడుతూ ‘‘ముందస్తు చర్యలు అంటే తరచూ చిన్న చిన్న మార్పులను క్రమం తప్పకుండా ఆచరించటం. ఇందుకు మనం తీసుకునే ఆహారం మంచి ప్రారంభ స్థానం. పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ఆకుకూరలతో కూడిన భోజనం ఒక పటిష్టమైన పునాది. మీ రోజువారీ ఆహారంలో మరిన్ని పోషకాలను చేర్చడానికి బాదంపప్పులు ఒక సులభమైన మార్గం. సమతుల, వైవిధ్యభరితమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా వీటిని ఒక్కసారి మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా తీసుకోవడం ముఖ్యం’’ అని పేర్కొన్నారు.
భారతీయ ఆహార మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. సమతుల, వైవిధ్యభరితమైన ఆహారంలో భాగంగా పురుషులు రోజుకు 40 గ్రాములు, మహిళలు 30 గ్రాముల నట్స్ తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నాయి (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ భారతీయుల ఆహార మార్గదర్శకాలు, 2024). ముందస్తు చర్యలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీ జీవితంలో సమతుల, వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లను భాగం చేసుకోవడం మెరుగైన ఆరోగ్యానికి కీలకమైన అడుగు. ఆహార ఎంపికలపై అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం దీర్ఘకాలిక శ్రేయస్సుకు దోహదపడతాయి. (Story: ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యం)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

