Homeవార్తలుగోద్రెజ్ ఆగ్రోవెట్ బలమైన రెండంకెల ఆదాయ వృద్ధి

గోద్రెజ్ ఆగ్రోవెట్ బలమైన రెండంకెల ఆదాయ వృద్ధి

గోద్రెజ్ ఆగ్రోవెట్ బలమైన రెండంకెల ఆదాయ వృద్ధి

ముంబై: గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఈరోజు, సెప్టెంబర్ 30, 2026తో ముగిసిన 2027 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం, మొదటి అర్ధభాగం కోసం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గోద్రెజ్ ఆగ్రోవెట్, అధిక రాబడులు, అమ్మకాల పరిమాణం మద్దతుతో యానిమల్ న్యూట్రిషన్, ఆయిల్ పామ్, బీ2సీ ఫుడ్స్ విభాగాలలో పటిష్టమైన పనితీరు కనబరచడంతో, ఎఫ్వై27 రెండవ త్రైమాసికంలో రూ.2,995 కోట్ల ఆదాయంతో 17% బలమైన వృద్ధిని సాధించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈబీఐటీడీఏ రూ.222 కోట్ల వద్ద స్థిరంగా ఉంది. ముడిసరుకుల ధరల ద్రవ్యోల్బణం, ఎల్ నినో సంబంధిత సవాళ్ల కారణంగా మార్జిన్లు సుమారు 120 బేసిస్ పాయింట్లు ప్రభావితమయ్యాయి. యానిమల్ న్యూట్రిషన్‌లో బలమైన పనితీరు, క్రాప్ కేర్, డెయిరీ, ఆస్టెక్‌ విభాగాలలో ఈబీఐటీడీఏ క్షీణతను భర్తీ చేయడానికి సహాయపడింది. పన్నుకు ముందు లాభం (పీబీటీ) 5% పెరిగి రూ.131 కోట్లకు చేరగా, పన్ను తర్వాత లాభం (పీఏటీ) 22% వృద్ధితో రూ.103 కోట్లకు చేరింది. కంపెనీ బలమైన వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణను కూడా ప్రదర్శించింది, గత సంవత్సరం ఇదే కాలంలోని 32 రోజుల (సుమారు రూ.894 కోట్లు)తో పోలిస్తే, తన వర్కింగ్ క్యాపిటల్ సైకిల్‌ను 21 రోజులకు (సుమారు రూ.655 కోట్లు) మెరుగుపరుచుకుంది. ఎఫ్‌వై27 మొదటి అర్ధభాగంలో, గోద్రేజ్ ఆగ్రోవెట్ తన ఆదాయ వృద్ధి వేగాన్ని కొనసాగించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 13% పెరుగుదలతో రూ.5,847 కోట్లను నమోదు చేసింది. ఈ వృద్ధికి ప్రధానంగా ఆయిల్ పామ్, యానిమల్ న్యూట్రిషన్ దోహదపడగా, డెయిరీ, ఫుడ్స్ విభాగాల సహకారం లభించింది. అయితే, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈబీఐటీడీఏ, పీబీటీ, పీఏటీ వరుసగా 5%, 4%, 1% తగ్గాయి. (Story: గోద్రెజ్ ఆగ్రోవెట్ బలమైన రెండంకెల ఆదాయ వృద్ధి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments