అమరావతికి చట్టబద్ధత: వినుకొండ జనసేన కార్యాలయంలో సంబరాలు….
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాలు, నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను సూచనల మేరకు వెల్లటూరు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో దీపాలు వెలిగించి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.(Story ; అమరావతికి చట్టబద్ధత: వినుకొండ జనసేన కార్యాలయంలో సంబరాలు…. )

