Homeవార్తలుతెలంగాణరేవల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

రేవల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

రేవల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

న్యూస్ తెలుగు/వనపర్తి  : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేవల్లి మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
_నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాల ఏర్పాటు కోసం కలెక్టర్ చొరవ అభినందనీయ కానీ ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు

ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మండలాల్లో నూతన కార్యాలయ భవనాల ఏర్పాటుకు కృషి చేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి తెలిపారు

రేవల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు

రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి అడుగుపెట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు

ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని పలు మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు మారడం సంతోషకరమన్నారు.

ఏదుల, రేవల్లి, శ్రీరంగాపూర్ మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణం కోసం ఒక్కో భవనానికి రూ.32 లక్షలను కలెక్టర్ తన సొంత నిధుల నుంచి కేటాయించి వేగంగా పూర్తి చేయించడం అభినందనీయమని తెలిపారు

ఈ కొత్త భవనాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు

ఇప్పటికే రేవల్లి నుండి ఏదుల కు మంచి రహదారి సౌకర్యాన్ని ఇటీవలే నూతనంగా నిర్మించామని అలాగే రేవల్లి మండలంలోని తాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ లైన్ ద్వారా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయ భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు, మంజూరు అయిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చేందుకు సహకరించిన వారిని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : రేవల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!