నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే….
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణంలోని నారాయణ స్కూల్‌లో పీపీ-2 నుంచి 1వ తరగతికి, 5 నుంచి 6వ తరగతికి ప్రమోట్ అయిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డ్రెస్సుల్లో సందడి చేసిన చిన్నారులకు సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల కృషి, పట్టుదలకు ఇది గుర్తింపు అని అభినందించారు. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందిస్తూ వారి భవిష్యత్తుకు మంచి ఆరంభంగా నిలుస్తుందని ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జెడ్‌సీఓలు రిహాని, గౌసియా విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు అనురాధ, రాగసుధ, ఏవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story : నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే…. )
