రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సు ల ముమ్మర తనిఖీ లు
న్యూస్ తెలుగు/చింతూరు : రాష్ట్రంలో లో జరుగుతున్న బస్ లలో అగ్ని ప్రమాదాలు,ఆక్సిడెంట్ లు తరచూ జరుగుతున్నాయి.వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బస్సుల స్పెషల్ డ్రైవ్ లో తనిఖీలో భాగంగా రవాణాశాఖ & పోలీస్ శాఖ, అగ్నిమాపక ల సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 3 శాఖల సిబ్బంది సమన్వయంతో బుధవారం తెల్లవారు జామున బస్ తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బండారు చల్లారావు మాట్లాడుతూ రాష్టమంతటా బస్ ల స్పెషల్ డ్రైవ్ తనిఖీ జరుగుతుందని తెలిపారు . ఈ స్పెషల్ డ్రైవ్ తనిఖీ లో భాగంగా రవాణాశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బస్ లు విస్తృతంగా తనిఖీ చేస్తున్న ట్లు తెలిపారు., ప్రతి బస్సులో ఎమర్జెన్సీ డోర్, ఎమర్జెన్సీ విండో, ఫైర్ ఎగ్జిఇష్టర్ తప్పనిసరిగా వుండాలని తనిఖీ చేసి , లేని బస్సులకు తగిన విధమైన చలానాలను విధించడం జరిగిందన్నారు .వాహన ప్రయాణం లో ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యమని, ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించవలసిందిగా వాహన డ్రైవర్స్ ను హెచ్చరించడం జరిగిందన్నారు.(Story : రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సు ల ముమ్మర తనిఖీ లు )
