బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు ఘన సత్కారం….
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ప్రెసిడెంట్‌గా గెలుపొందిన పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్‌ను వినుకొండ పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది షేక్ సిద్దయ్య మాట్లాడుతూ.. వినుకొండ బార్ అసోసియేషన్ చరిత్రలో తొలిసారిగా ఓ ముస్లిం మైనార్టీ అభ్యర్థి ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం సంతోషకరమన్నారు. నూతన ప్రెసిడెంట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గౌస్ మొహిద్దీన్ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని న్యాయవాదులు సౌదాగర్ అబ్దుల్ హాఫీజ్, జె.ఎస్.కే. నాగూర్, చెరుకుంపాలెం అస్మతుల్లా ఖాన్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు ఘన సత్కారం…. )
