వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ ఘన విజయం..
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ 58 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బార్ అసోసియేషన్ పరిధిలో మొత్తం 126 మంది సభ్యులకు గాను 108 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్‌కు 78 ఓట్లు రాగా, ప్రత్యర్థి అశోక్ బాబుకు 20 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు నోటాకు పడగా, మరో 2 ఓట్లు చెల్లనివిగా (ఇన్వాలిడ్) తేలాయి.మిగిలిన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మీసాల శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారి వరగాని శివశంకర్ బాబు వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్‌గా ముండ్రు చంద్రమోహన్, సెక్రటరీగా మారెళ్ళ సీతారామాంజనేయులు, జాయింట్ సెక్రటరీగా చీమకుర్తి బ్రహ్మం, ట్రెజరర్‌గా దూళ్ల నాగరాజు, లేడీ రిప్రజెంటేటివ్‌గా పొట్లూరి మాధవి, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా మాడావత్ శివ నాయక్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన నూతన కార్యవర్గానికి సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని, జూనియర్ న్యాయవాదులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తన గెలుపునకు కృషి చేసిన సీనియర్, యూనియన్ న్యాయవాదులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(Story : వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ ఘన విజయం.. )

