Homeవార్తలుతెలంగాణమతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండగ

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండగ

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండగ

న్యూస్ తెలుగు/వనపర్తి : రంజాన్ పండుగ సందర్భంగా వనపర్తి పట్టణంలోని గోపాల్పేట రోడ్ లో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఈద్గా వద్దకు చేరుకుని ముస్లిం సహోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకుంటారని రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో నిష్టగా ముస్లిం సోదరులు మాసము మొత్తం ప్రార్థనలు చేసుకుని రంజాన్ పండుగ రోజున ఈద్గా ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి కుల మతాలకతీతంగా ఈ పండగలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఐక్యతకు మారుపేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, pcc సభ్యులు శంకర్ ప్రసాద్, వనపర్తి మండలం మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఖిల్లా ఘణపురం మండల నాయకులు సాయి చరణ్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు వారికి ఆదిత్య, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ముస్లిం సోదరులు మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!