చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర కాయకల్ప టీమ్
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిని కాయకల్ప టీమ్ సందర్శించింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అమలు చేస్తున్న శానిటేషన్ విధానం, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, వార్డుల నిర్వహణ, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.అలాగే నవజాత శిశు కేంద్రం (యస్ యన్ సి యు ), డయాలసిస్ సెంటర్‌ను సందర్శించి అక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరికరాల వినియోగం, సిబ్బంది సేవలను పరిశీలించారు.ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది చేస్తున్న కృషిని కాయకల్ప టీమ్ సభ్యులు అభినందించారు. ఆసుపత్రి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి సింగంపల్లి అరుణకుమారి, స్టేట్ పిపిఎం కోఆర్డినేటర్ (టి బి), శ్రీమతి సబితా సుధా లలితా, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అస్యూరెన్స్ కన్సల్టెంట్, డాక్టర్ కోటిరెడ్డి సూపరింటెండెంట్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర కాయకల్ప టీమ్ )
