Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు 125 వ జయంతి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు 125 వ జయంతి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు 125 వ జయంతి

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం, చరిత్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షత వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగువారిపై తమిళుల నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎమ్.శేఖర్, జి. వెంకట్రావు, డా.వై.పద్మ, ఎస్.అప్పనమ్మ, జి.హారతి,కె.శైలజ, ఎం. నాగ మోహన్, జి.సాయికుమార్, బి. శ్రీనివాసరావు, ఆర్. మౌనిక, కె.లక్ష్మీప్రసన్న కుమారి,ఆర్. కిరణ్మయి, కె. కీర్తి,అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు 125 వ జయంతి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!