Homeవార్తలుతెలంగాణ3గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ గేయం

3గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ గేయం

3గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ గేయం

న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను చేపట్టి ముందుకెల్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం పనులను ప్రారంభించారు. సి సి రోడ్డు నిర్మాణం నాణ్యవంతంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో అంతర్గత డ్రైనేజ్ నిర్మాణానికి క్షేత్రం ఆయన పనులను ప్రారంభించారు. విద్యార్థులతో శ్రమదానం.వనపర్తి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు NCC క్యాంపులో భాగంగా పెద్దగూడెం గ్రామంలో వారి సేవలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే గారు విద్యార్థులతో కలిసి కాసేపు శ్రమదానం చేశారు. విద్యార్థులు క్యాంపు అయిపోయి లోగా గ్రామ మొత్తం పరిశుభ్రంగా మారాలని చివరి రోజు నేనే వచ్చి మీకు విందు భోజనం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే విద్యార్థులతో చెప్పారు. విద్యార్థి దశలో ఇలాంటి క్యాంపులు నూతన ఉత్సాహాన్ని కలుగజేస్తాయని గ్రామ ప్రజలతో సఖ్యతగా మెలిగి శిబిరం ఉద్దేశాన్ని అమలు చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుష్పలత శివకుమార్, శేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శారదమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : 3గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ గేయం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!