Home వార్తలు తెలంగాణ క్రీడలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు

క్రీడలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు

0

క్రీడలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం చిన్న గుంట పల్లి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వివేకనంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలను మంగళవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఉందని, విద్యార్థులు ఉన్నత చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారిస్తే ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చునని వారు పేర్కొన్నారు.జిల్లా క్రికెట్ క్రీడా పోటీలలో 32 జట్లు పాల్గొంటున్నాయని క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సమానమని ఎవరు ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మండలం మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య, వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య శివ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.(Story : క్రీడలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version