Homeవార్తలుతెలంగాణవిద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

న్యూస్ తెలుగు/వనపర్తి : వేసవిలో విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని లో వోల్టేజ్, ఓవర్ లోడ్ సమస్యలను తగ్గించేందుకు వనపర్తి జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మూడు కోట్ల 50 లక్షల రూపాయలతో వనపర్తి జిల్లా వ్యాప్తంగా 250 నియంత్రికలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఇందులో 13 నియంత్రికలను వనపర్తి పట్టణంలోనే ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండడం వలన ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని అందుకు అనుగుణంగానే ఈ నియంత్రికల ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ అధికారులు SE తిరుపతిరావు, DE శ్రీనివాస్, AD శ్రీనివాస్, సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!