Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎన్.ఎం.యు వ్యవస్థాపకులు స్వర్గీయ పి. రామ్మోహనరావు 22వ వర్ధంతి వేడుకలు

ఎన్.ఎం.యు వ్యవస్థాపకులు స్వర్గీయ పి. రామ్మోహనరావు 22వ వర్ధంతి వేడుకలు

ఎన్.ఎం.యు వ్యవస్థాపకులు స్వర్గీయ పి. రామ్మోహనరావు 22వ వర్ధంతి వేడుకలు

న్యూస్ తెలుగు / వినుకొండ :

ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు స్వర్గీయ పి రామ్మోహన రావు 22వ వర్ధంతి సభ గురువారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమాన్ నాయక్, తొలుత రామ్మోహన రావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి వి. శివా నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిపో కమిటీ చైర్మన్ ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ. రామ్మోహన్రావు ఆర్టీసీలో బానిసత్వ విధానమైన గ్రేడ్ 3 విధానాన్ని రద్దు చేయించారని, ఆటోమేటిక్ డి ఎ విధానాన్ని, ఎస్.ఆర్. బీ.ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆర్టీసీలో 38 సంవత్సరాలు సుదీర్ఘకాలం యూనియన్ కార్యదర్శిగా పనిచేసిన ఏకైక వ్యక్తి రామ్మోహన రావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బి సౌభాగ్యరాజు, బిఎస్ సింగ్, ముసలయ్య, కె ఎస్ ఎన్ రెడ్డి, ఈ పి కే రావు, ముప్పాళ్ళ శ్రీను, కాళీ, వైయస్ రావు, ఆరోగ్యం, విలియం, మౌలాలి, నీలిమ, పద్మ, నరసింహారావు, రేవతి తదితరులు పాల్గొన్నారు. (Story :ఎన్.ఎం.యు వ్యవస్థాపకులు స్వర్గీయ పి. రామ్మోహనరావు 22వ వర్ధంతి వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!