Home వార్తలు తెలంగాణ అంగరంగ వైభవంగా శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం

0

అంగరంగ వైభవంగా శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంతో పాటు, రహదారులు వసతి గృహాలు, రంగసముద్రాన్ని అభివృద్ధి పరిచి బోటింగ్ ఏర్పాటు చేసేందుకు, రంగసముద్ర నుంచి వచ్చే వరద వలన పంట కాలువలు కోసుకుపోకుండా ఉండేందుకు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం బుధవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , వనపర్తి రాజవంశీయులు రాజా కృష్ణదేవరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో నుంచి పల్లకిలో ఊరేగింపుగా రథం వద్దకు చేర్చారు అనంతరం రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి రథాన్ని లాగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీరంగాపురం గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామనిఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని రూ 5 కోట్లతో టూరిజం హబ్బుగా మార్చనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. రూ. 2 కోట్ల రూపాయలతో ఆలయానికి సంబంధించిన ప్రధాన రహదారిని బాగు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 1 కోటి 50 లక్షల రూపాయలతో అతిథి గృహాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రూ. 24 కోట్ల రూపాయలతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో శ్రీ రంగనాయక సముద్ర వెనకాల ఉన్న పంట పొలాలలోని కాలువలను బలోపేతం చేసేందుకు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దిలేటి వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైట్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, శ్రీరంగపురం మండల నాయకులు శ్రీహరి రాజు, పెబ్బేరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : అంగరంగ వైభవంగా శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version